: టీఆర్పీ కోసం అత్యుత్సాహం ఎందుకు?: రోజా


టాలీవుడ్ డ్రగ్స్ దందాలో సిట్ విచారణలో నిత్యమూ లీకులు వస్తుండటం, వాటిని మీడియా ప్రముఖంగా చూపుతూ ఉండటంపై నటి, వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. "సినిమావాళ్ల జీవితంపై ఒక్క రాయి మీరేస్తే, అది పగిలిపోతుంది. ఈరోజు కొంతమంది సినిమా ఆర్టిస్టులపై వార్తలు ప్రసారం చేస్తూ, పబ్లిసిటీ, టీఆర్పీ కోసం చానళ్లు అత్యుత్సాహం చూపుతున్నాయి. కాస్తంత మానవత్వం చూపండి. వారికీ కుటుంబాలుంటాయి. ఇళ్లల్లో ఆడపిల్లలు ఉంటారు. వాళ్లకీ పెళ్లిళ్లు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు పబ్లిసిటీ కోసం వాళ్లను విచిత్రంగా చూపిస్తున్నారు. రేపు వాళ్ల ఇంట్లో మంచికార్యం జరగాలంటే... వాళ్ల పరువు పోయేలా చేస్తే ఎలా? విచారణ తరువాత ఈ దందాతో సంబంధాలు లేవని తెలిస్తే తప్పెలా సరిదిద్దుకుంటారు?" అని రోజా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News