: రాంగోపాల్ వర్మకు కౌంటరిచ్చిన జొన్నవిత్తుల... ఏం చేసిందని చార్మి వీరనారి?


నిన్న సిట్ విచారణను ఎదుర్కొని బయటకు వచ్చిన చార్మీని టీవీ చానళ్లలో చూసిన వర్మ, ఆమెను వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయితో పోలుస్తూ, దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై గేయ రచయిత జొన్నవిత్తుల మండిపడ్డారు. "వర్మ... సిట్ అధికారి కార్యాలయం నుంచి వస్తున్న చార్మిని చూస్తుంటే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఉన్నది అని. ఇంతకుపూర్వం కన్నా చాలా అందంగా కనిపించిందని అన్నారు. అది చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్య. ఆయన దాన్ని వెనక్కు తీసుకోవాలి. ఎందుకంటే, చార్మి వీరనారి కాదు. సిట్ అధికారులు ఆంగ్లేయులు కాదు. ఓ డ్రగ్ నేరారోపణలో అనుమానితురాలిగా ఆవిడను పిలిచి, వాళ్లు విచారణ చేస్తున్నారు. ఆ విచారణ ముగించుకుని బయటకు వచ్చినప్పుడు, ఆవిడ నిబ్బరంగా ఉందని అనొచ్చు. లేకుంటే, మరో విధంగా ఆమెను ప్రశంసించొచ్చు. దానికేమీ ఎవరికీ అభ్యంతరాలు ఉండవుగానీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించిందనడం ఇబ్బందికరమైన వ్యాఖ్య.

 దేశ ప్రజలు అందరూ కూడా ఝాన్సీని దేశభక్తికి ప్రతీకగా, ప్రతినిధిగా ఆరాధారిస్తారు. చార్మీ ఝాన్సీలా కనిపించిందంటే, ఆమెలో అందం కనిపించకూడదు. సాహసం, పరాక్రమం, త్యాగం... ఇవి కనిపించాలి. అలా కాకుండా, ఇలా వ్యాఖ్యానించడం, చాలామందిని కోపావేశాలకు గురి చేస్తుంది. ఈ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటే బాగుంటుంది. సిట్ పై ఆయన అభిప్రాయాలను చెప్పవచ్చు. కానీ, దేశభక్తురాలితో చార్మిని పోల్చడం తగదు. రాంగోపాల్ వర్మ ప్రతిష్ఠకూ మచ్చగా మిగులుతుంది" అని జొన్నవిత్తుల అన్నారు.

  • Loading...

More Telugu News