: జానారెడ్డిని వదలని సామాజిక కార్యకర్త!
ఆస్తులపై విచారణ పిటిషన్ నుంచి ఉపశమనం పొందిన మంత్రి జానారెడ్డికి మరోసారి చిక్కులు తప్పేలా లేవు. గతంలో ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన వీవీ రావు అనే సామాజిక కార్యకర్త మరోసారి జానాపై ఫిర్యాదు చేశారు. అయితే, ఈసారి కోర్టుకు కాకుండా.. నేరుగా సీబీఐతో పాటు సీవీసీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ లకు జానాపై ఫిర్యాదు చేశారు. వీవీ రావు 'ఇండియా ఎగనెస్ట్ కరెప్షన్' ఉద్యమకారుడు. ఇంతకుముందు జానారెడ్డి ఆస్తులపై విచారణ చేయాలంటూ ఈయన వేసిన పిటిషన్ లో పసలేదంటూ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.