: రామేశ్వరం నుంచి అయోధ్య వయా తెలుగు రాష్ట్రాలు... కొత్త రైలు


తెలుగు రాష్ట్రాలకు మరో రైలు అందుబాటులోకి రానుంది. తమిళనాడులోని రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య వరకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ రోజు ఈ రామేశ్వరం-ఫైజాబాద్ (వయా అయోధ్య) వారపు రైలును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఏపీలోని గూడూరు, విజయవాడ, తెలంగాణలోని వరంగల్ లలో ఆగుతుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు రామేశ్వరం నుంచి ప్రతి ఆదివారం రాత్రి 11.50 గంటలకు, ఫైజాబాద్ నుంచి ప్రతి బుధవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది.    

  • Loading...

More Telugu News