: రాజ్యసభలో అడుగుపెట్టనున్న అమిత్ షా!


భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ షా త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపి నడ్డా మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల్లో అమిత్ షా పోటీ చేయనున్నారని, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతీ ఇరానీ రెండోసారి కూడా ఈ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పోటీ చేస్తారని చెప్పారు.

కాగా, గుజరాత్ నుంచి రాజ్యసభకు మూడు స్థానాలకు వచ్చే నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాల్లో అమిత్ షా, స్మృతి ఇరానీ పేర్లు ప్రకటించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు, మూడో స్థానానికి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.  ఇదిలా ఉండగా, వచ్చే నెలలో స్మృతీ ఇరానీ రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది.

 

  • Loading...

More Telugu News