: అప్పుడే పుట్టిన బిడ్డకు డ్రగ్స్ పట్టించిన తల్లిదండ్రులు... విషమించిన శిశువు ఆరోగ్యం
ఆసుపత్రి సిబ్బంది లేని సమయంలో స్వయంగా తల్లిదండ్రులే తమ బిడ్డకు డ్రగ్స్ పట్టించారు. సబిక్సోన్ ట్యాబ్లెట్లను పొడి చేసి, శిశువు నాలుక మీద వేశారు. ఈ ట్యాబ్లెట్లలో అతి ప్రమాదకరమైన హెరాయిన్ ఉంటుంది. దీని మోతాదు ఎక్కువవడంతో శిశువు ఏడుస్తూ, వణకడం ప్రారంభించాడు. ఇలా ఎందుకు జరుగుతోందో వైద్యులకు అంతుపట్టలేదు. తర్వాత పరీక్షలు చేసి శిశువు కడుపులో హెరాయిన్ ఉందని తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు.
శిశువు తల్లిదండ్రులు క్రిస్టెన్‌సన్, కాల్బీవిల్డ్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, గర్భవతిగా ఉన్నపుడు కూడా తాను డ్రగ్స్ తీసుకున్నట్లు క్రిస్టెన్‌సన్ తెలిపారు. అలా డ్రగ్స్ తీసుకోవడం వల్ల తన శిశువుకు కూడా పిండదశలో ఉన్నపుడే డ్రగ్స్ అలవాటై ఉంటుందని, విపరీతంగా ఏడుస్తుండటంతో డ్రగ్స్ కోసమే అనుకొని హెరాయిన్ పట్టించినట్లు విచారణలో తల్లిదండ్రులు అంగీకరించారు. తర్వాత వాళ్లింట్లో సోదా చేసిన పోలీసులకు భారీ మొత్తంలో హెరాయిన్ దొరికినట్లు సమాచారం.