: సెహ్వాగ్ రికార్డును తృటిలో మిస్ అయిన ధావన్!


శ్రీలంకతో గాలెలో జరుగుతున్న తొలి టెస్టులో 190 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద ఔటైన శిఖర్ ధావన్... డబుల్ సెంచరీనే కాదు, ఓ రికార్డును కూడా మిస్ అయ్యాడు. 190 పరుగులు చేసిన క్రమంలో... ఒక్క సెషన్ లో ధావన్ 126 పరుగులు చేశాడు. ఒక్క సెషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ గా సెహ్వాగ్ మీద ఈ రికార్డు ఉంది. 2009లో ముంబైలో శ్రీలంకతో జరిగిన టెస్టులో ఒకే సెషన్ లో సెహ్వాగ్ 133 పరుగులు చేసి, రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ నేపథ్యంలో, సెహ్వాగ్ రికార్డును కేవలం 7 పరుగుల తేడాతో ధావన్ కోల్పోయాడు. వీరిద్దరి తర్వాత 121 పరుగులతో వీవీఎస్ లక్ష్మణ్ మూడో స్థానంలో ఉన్నాడు. 

  • Loading...

More Telugu News