: ఆ వ్యవహారం గురించి ఇక్కడ మాట్లాడొద్దు: తిరుమలలో హీరో గోపీచంద్
గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది రూపొందించిన ‘గౌతమ్ నంద’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘గౌతమ్ నంద’ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ, ‘గౌతమ్ నంద’ శుక్రవారం విడుదల కానుందని, స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని చెప్పాడు. స్వామివారి దర్శనం బాగా జరిగిందని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే, ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన డ్రగ్స్ వ్యవహారం గురించి గోపీచంద్ ను మీడియా ప్రశ్పించగా, ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడొద్దంటూ సున్నితంగా తిరస్కరించారు.