: నిరాశపరిచిన కోహ్లీ.. భారత్ 294/3
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా వడివడిగా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా... కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 8 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ నువాన్ ప్రదీప్ బౌలింగ్ లో కీపర్ డిక్ వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం అజింక్యా రహానే క్రీజులోకి వచ్చాడు. పుజార నిలకడగా ఆడుతూ 149 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 294 పరుగులు.