: `సిటిజన్ ముఖర్జీ`గా మారిన మాజీ రాష్ట్రపతి
`నిజజీవితంలో జరిగే మార్పులకు తగినట్లుగా డిజిటల్ జీవితంలో కూడా జరగాలి` అనే విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ట్విట్టర్‌లో తన అకౌంట్ హ్యాండ్లర్‌ను `సిటిజన్ ముఖర్జీ`గా మార్చుకుని భారత ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఇప్పటి వరకు `రాష్ట్రపతిభవన్` హ్యాండ్లర్ ద్వారా ట్వీట్లు చేసిన ఆయన స్థానంలో కొత్త రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రావడంతో తన హ్యాండ్లర్‌ను ప్రణబ్ మార్చుకున్నారు.
రాష్ట్రపతిగా ప్రణబ్ తన చివరి ప్రసంగంలో `ఇక నుంచి ప్రజలతో సాధారణ పౌరుడిగా సంభాషిస్తాను` అని వెల్లడించినట్లుగానే తన ట్విట్టర్ హ్యాండ్లర్‌ను `సిటిజన్ ముఖర్జీ` అని మార్చుకోవడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్రపతిగా ఆయన చేసిన ట్వీట్లను రాష్ట్రపతి భవన్ అకౌంట్లో `పీఓఐ13` హ్యాండ్లర్ పేరిట అందుబాటులో ఉంచారు. `సిటిజన్ ముఖర్జీ`గా తన మొదటి ట్వీట్ ద్వారా రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రణబ్ అభినందనలు తెలియజేశారు.