: పర్సనల్ లాయర్ తో కలసి సిట్ కార్యాలయానికి ఛార్మి.. ఆఫీసు వద్ద భారీ బందోబస్తు!
డ్రగ్స్ వ్యవహారంలో విచారణకు గాను ప్రముఖ సినీ నటి ఛార్మి సిట్ కార్యాలయానికి వచ్చింది. తనతో పాటు పర్సనల్ లాయర్ ను కూడా ఎక్సైజ్ కార్యాలయం వరకు తీసుకొచ్చింది. పర్సనల్ లాయర్ ను విచారణ గదిలోకి అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, తన లాయర్ ను కార్యాలయం వెలుపలే వదిలిపెట్టి, తాను మాత్రమే విచారణ గదిలోకి వెళ్లింది. నలుగురు మహిళా అధికారులు ఛార్మిని విచారిస్తున్నారు. ఛార్మి విచారణ సందర్భంగా సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు, హైకోర్టు సూచనల మేరకే ఆమెను విచారిస్తున్నారు.