: 'టీజర్ కా బాప్' అంటూ... బాలయ్య తొలి లుక్స్ విడుదల చేసిన పూరీ జగన్నాథ్
తన దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న 'పైసా వసూల్' ఫస్ట్ లుక్స్ ను పూరీ జగన్నాథ్, కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. చిత్రం 'స్టంపర్' ఈ నెల 28న ఉదయం 10.22కు విడుదల చేస్తామని చెబుతూ 'స్టంపర్ కా బాప్', 'టీజర్ కా బేటా' అంటూ 24 సెకన్ల నిడివి వున్న ఫోటోలతో కూడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇందులో బాలయ్య గడ్డంతో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తుండటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన నిమిషాల్లోనే దీన్ని వేల మంది చూసేశారు. దీన్ని మీరూ చూడవచ్చు.