: బ్లూ కలర్ చుడీదార్ లో సిట్ కార్యాలయానికి వచ్చిన ఛార్మింగ్ ఛార్మి!


డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నటి ఛార్మి సిట్ కార్యాలయానికి చేరుకుంది. ఆమెతో పాటు కొందరు బౌన్సర్లు కూడా వచ్చారు. ఛార్మి సిట్ కార్యాలయంలోకి అడుగుపెడుతున్న సమయంలో, అక్కడ చాలా హడావుడి నెలకొంది. బ్లూ కలర్ చుడీదార్ వేసుకుని విచారణకు ఆమె హాజరైంది. మహిళా పోలీసు అధికారులు ఆమెను లోపలకు తీసుకెళ్లారు. ఈ నాటి ఛార్మి విచారణలో డ్రగ్స్ వ్యవహారంలో పలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కెల్విన్ ఫోన్ లో ఛార్మి పేరును 'ఛార్మి దాదా'గా ఫీడ్ చేసుకోవడంపై సిట్ అధికారులు ఫోకస్ చేసినట్టు సమాచారం. కెల్విన్ తో ఛార్మికి మంచి సంబంధాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News