: ఈ స్మార్ట్ స్టిక్కర్‌తో లైంగిక వేధింపుల నుంచి బయటపడొచ్చు.. అభివృద్ధి చేసిన ఎంఐటీ రీసెర్చర్!
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వాలు, పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలు వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రీసెర్చర్ ఒకరు అద్భుతమైన స్టిక్కర్‌ను అభివృద్ధి చేశారు. ఇది లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు.
‘స్మార్ట్ స్టిక్కర్’గా పిలిచే దీనిని దుస్తుల్లో అతికించుకోవచ్చు. అలాగే బ్లూటూత్ ద్వారా ఫోన్‌లోని యాప్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. మహిళపై వేధింపులు జరిగితే వెంటనే ఇది గుర్తించి ఐదు నంబర్లకు టెక్ట్స్ మెసేజ్ పంపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రత దృష్ట్యా వారిని బయటకు పంపించేందుకు ఇష్టపడడం లేదని, ఇంట్లో ఉండే పనులే చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఎంఐటీ రీసెర్చర్ మనీషా మోహన్ తెలిపారు. అయితే తాజాగా అభివృద్ధి చేసిన ‘స్మార్ట్ స్టిక్కర్’తో ఎటువంటి భయం లేకుండా బయటకు వెళ్లవచ్చని తెలిపారు. ఈ స్టిక్కర్ పనితీరును 70 మందిపై పరీక్షించినట్టు తెలిపారు. స్మార్ట్ స్టిక్కర్ పనితీరుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.