: మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసు.. నటి కావ్యా మాధవన్‌ను ప్రశ్నించిన పోలీసులు
మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసులో నటి, నటుడు దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను మంగళవారం ఇన్వెస్టిగేషన్ టీం ప్రశ్నించింది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) బి.సంధ్య ఆధ్వర్యంలోని బృందం అలువాలోని దిలీప్ ఇంట్లో ఆమెను ప్రశ్నించింది. నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత తాను కొచ్చిలో కావ్య నిర్వహిస్తున్న ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ ‘లక్ష్య’కు వెళ్లినట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ దర్యాప్తులో వెల్లడించాడు. దీంతో లక్ష్యపై పోలీసులు దాడులు నిర్వహించారు.
కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌కు బెయిల్ ఇచ్చేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండడంతో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్టు న్యాయస్థానం పేర్కొంది. పోలీసులు అరెస్ట్ చేయడంతో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) నుంచి దిలీప్‌ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం దిలీప్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.