: గుజరాత్ వరద ప్రాంతాలలో ప్రధాని ఏరియల్ సర్వే... 500 కోట్ల పరిహారం ప్రకటన


గుజరాత్ లో వరదలు ముంచెత్తిన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆ సందర్భంగా 500 కోట్ల రూపాయల తక్షణ సాయంగా ప్రధాని ప్రకటించారు. వరద బాధితులను రక్షించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎన్టీఆర్ఎప్ దళాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. వరదల్లో మృతి చెందినవారికి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. వరదల కారణంగా గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా, గుజరాత్ వరదలతో వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News