: డ్రగ్స్ వాడకంలో చాలా మంది పెద్దలున్నారు... వాళ్లని వదిలేసి సినిమావాళ్లపై బడ్డారు: రోజా మండిపాటు


డ్రగ్స్ వాడకంలో చాలా మంది బడాబాబులున్నారని, వారందర్నీ వదిలేసి సినిమా వాళ్లపై పడ్డారని సినీ నటి, ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చిత్తూరు కలెక్టరేట్ దగ్గర ఆమె మాట్లాడుతూ, డ్రగ్స్ ను అరికట్టడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయిని అన్నారు. డ్రగ్స్ విచ్చలవిడి వినియోగానికి నిఘా వర్గాల వైఫల్యమే కారణమని ఆమె ఆరోపించారు. డ్రగ్స్ విచారణలో పెద్దలను వదిలేసి, కేవలం సినిమా వారినే లక్ష్యం చేసుకున్నారని ఆమె విమర్శించారు.

వేర్లను వదిలి, కొమ్మలు, ఆకుల్ని పట్టుకుంటే ఫలితం ఉండదని ఆమె స్పష్టం చేశారు. కేవలం రేటింగ్ కోసం మీడియా సంస్థలు సినీ నటుల పరువును బజారుకీడుస్తున్నాయని ఆమె ఆరోపించారు. మాదక ద్రవ్యాల వినియోగంలో హస్తమున్న పెద్దవారి పేర్లు చెబుతానని దర్శకుడు పూరీ జగన్నాథ్ విసిరిన సవాల్ ను ఎందుకు స్వీకరించలేదని ఆమె నిలదీశారు. ఆయన చెప్పిన పేర్లను పరిగణనలోకి తీసుకుని విచారణ ఎందుకు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News