: క్రికెట్కు మిథాలీ అద్భుతమైన రాయబారి.. పొగడ్తల్లో ముంచెత్తిన సానియా మీర్జా
మహిళల ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టుపై ఏస్ టెన్సిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రశంసల వర్షం కురిపించింది. ముఖ్యంగా కెప్టెన్ మిథాలీని ఆకాశానికెత్తేసింది. క్రికెట్కు మిథాలీ అద్భుతమైన రాయబారి అని కొనియాడింది. చాలా ఏళ్లుగా ఆమె అద్భుతంగా రాణిస్తోందని, ఆమె నిస్సందేహంగా క్రికెట్కు రాయబారేనని పేర్కొంది. ప్రపంచకప్లో జట్టు మంచి ప్రదర్శన కనబరిచిందని, క్రికెట్లోకి రావాలనుకుంటున్న మహిళలకు ఇది మరింత ప్రేరణ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన వింబుల్డన్ ఓపెన్ డబుల్స్ కేటగిరీలో పాల్గొన్న సానియా మీర్జా మూడో రౌండ్లో వెనుదిరిగింది.