: దూరదర్శన్ చారిత్రక నిర్ణయం.. లోగో మార్చేందుకు రెడీ.. ఎంట్రీలు ఆహ్వానం!


ప్రభుత్వ రంగ టెలివిజన్ దూరదర్శన్ తన చానల్ లోగోను మార్చాలని నిర్ణయించింది. సరికొత్త డిజైన్ కోరుతూ ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానించింది. లోగో చూడగానే చానల్‌కు కొత్తదనం కనిపించేలా ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ఉన్న వారు పెద్దమొత్తంలో ఉన్నారని, వారు దూరదర్శన్‌ వైపు అంతగా ఆసక్తి చూపడం లేదని ప్రసారభారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిశేఖర్ వెంపటి పేర్కొన్నారు. గత తరంతో పోలిస్తే వీరు దూరదర్శన్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించేలా సరికొత్త డిజైన్‌తో ముందుకు రావాలని నిర్ణయించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News