: సిట్ విచారణ..కెల్విన్ నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారులు!
డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు వ్యాపారవేత్తలకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యాపారస్తులు భానోతు సౌరభ్, ఆకుల రితికేశ్, అంకిత్ అగర్వాల్ ఈ రోజు ఉదయం విచారణకు హాజరయ్యారు. కెల్విన్ నుంచి రెండేళ్లుగా పెద్దమొత్తంలో తాము డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు వారు చెప్పినట్టు సమాచారం. కాగా, ఈ రోజు ఉదయం సిట్ విచారణకు హాజరైన ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సుమారు నాలుగు గంటలపాటు విచారించి పంపివేశారు. రేపు ఉదయం సినీ నటి ఛార్మిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.