: డ్రగ్స్ కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మపై కోర్టులో పిటిషన్


డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను బాహుబలిలా మీడియా చూపిస్తోందంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయనపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. న్యాయవాది రంగప్రసాద్ ఈ మేరకు పిటిషన్ వేశారు. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయిని, అధికారుల మనోస్థయిర్యాన్ని దెబ్బతీసేలా వర్మ మాట్లాడారంటూ ఆ పిటిషన్ లో ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించే విధంగా వ్యవహరించడం, వ్యాఖ్యలు చేయడం ఐసీసీ సెక్షన్ 343 ప్రకారం చట్ట విరుద్ధమని, ఇలా ప్రవర్తించినందుకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.       

  • Loading...

More Telugu News