: ఐపీఎల్ ఫైనల్ పోరుకు టికెట్ల అమ్మకాలు షురూ


ఐపీఎల్ తాజా సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తోపాటు ఫైనల్ పోరుకు టికెట్ల అమ్మకాలు షురూ అయ్యాయి. ఈ రెండు మ్యాచ్ లకు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక. మే 24న రెండో క్వాలిఫయర్ మ్యాచ్, మే 26న టైటిల్ సమరం జరగనున్నాయి. ఈ మ్యాచ్ లకు గాను రూ. 300 నుంచి వివిధ స్థాయిల్లో టికెట్ల ధరలు ఉంటాయని ఐపీఎల్ నిర్వాహకులు చెప్పారు. నేటి నుంచి ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్ WWW.iplt20.com లో టికెట్లు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News