: సుందర్ పిచాయ్ మరో ఘనత ... ‘గూగుల్’ పేరెంట్ కంపెనీలో సభ్యుడిగా నియామకం!
ప్రముఖ సంస్థ గూగుల్ కు సీఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ మరో ఘనత సాధించారు. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లో సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ఫాబెట్ సీఈఓ ల్యారీ పేజ్ ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గూగుల్ సీఈఓ బాధ్యతలను సుందర్ పిచాయ్ బాగా నిర్వహిస్తున్నారని, కొత్త సంస్థలో సభ్యుడిగా నియమితులైన ఆయనతో కలిసి పని చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడతానని చెప్పారు. కాగా, 2004లో గూగుల్ లో చేరిన సుందర్ పిచాయ్, పలు విభాగాల్లో పనిచేశారు.2015లో గూగుల్ సీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు.