: సీనియర్లు అద్వాణీ, జోషీలకు శిరస్సు వంచి నమస్కరించిన కోవింద్!
భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నేడు పదవీబాధ్యతలను స్వీకరించారు. ప్రమాణస్వీకారం అనంతరం, తొలిసారి ఆయన ప్రసంగించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్ కు వెళ్లబోతూ, పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ముందు వరుసలో కూర్చున్న ప్రముఖులతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కురువృద్ధులు అద్వాణీ, మురళీ మనోహర్ జోషీలకు ఆయన శిరస్సు వంచి నమస్కరించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కోవింద్ ను అభినందించారు.