: ఓటమి కలచివేసింది...మేమందరమూ ఏడ్చేశాం: వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై పోరాడి ఓడిన టీమిండియా పడుతున్న బాధ అంతాఇంతా కాదు. మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ, ఫైనల్ మ్యాచ్ లో విజయానికి అతి దగ్గరగా వచ్చి ఓడిపోవడం తమను కలచివేసిందని, దీంతో, జట్టు సభ్యులందరమూ ఏడ్చేశామని చెప్పింది. జట్టు మేనేజ్ మెంట్ సిబ్బంది మమ్మల్ని బాధపడొద్దని చెబుతూనే ఉందని, అయినప్పటికీ ఆ బాధను దిగమింగలేకపోయామని పేర్కొంది.
అవార్డు ప్రదానోత్సవం జరిగిన అనంతరం, తాము బస చేసిన హోటల్ కు చేరుకునే సమయంలో, తమను ఏడవ వద్దని జట్టు సిబ్బంది మరోమారు సూచించారని చెప్పింది. ఆ తర్వాత కొంచెం తేరుకున్నామని, అయితే, ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు చేరిన తమ జట్టును చూసి ఎంతో గర్వపడుతున్నామని, గతాన్ని పక్కనపెట్టి, విజయాల కోసం పోరాడుతూ ముందుకు దూసుకువెళతామని హర్మన్ చెప్పుకొచ్చింది.