: ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశం... కుటుంబ సభ్యుల గ్రీన్ సిగ్నల్!


త‌మిళ‌నాట ఎంతో ప్రాబల్యం పొందిన ముగ్గురు ముఖ్య‌మంత్రులు సినిమా రంగానికి చెందిన వారే! ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డానికి త‌మ కుటుంబం ఎప్పుడూ అండ‌గానే ఉంటుంద‌ని ఆయ‌న చిన్న కూతురు సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ తెలిపింది. `మా నాన్న‌గారు ఏ నిర్ణ‌యం తీసుకున్నా అందుకు మా మ‌ద్ద‌తు ఉంటుంది. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి అన‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు` అంటూ త‌న తండ్రి రాజ‌కీయ ప్ర‌వేశంపై సౌంద‌ర్య‌ సుముఖత వ్య‌క్తం చేసింది.

నిజానికి త‌మిళ‌నాడులో ఉన్న మూడు రాజ‌కీయ‌పార్టీలు (డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే) ర‌జ‌నీకాంత్ రాక కోసం ఎదురుచూస్తున్నాయి. ఆయ‌న ఏదైనా పార్టీలో చేర‌తారా? లేక కొత్త పార్టీ పెడతారా? అన్న సందిగ్ధంలో ఆయా పార్టీల నాయ‌కులు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా త‌మిళంలో గొప్ప‌ పేరు ఉన్న మ‌రో న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ సోష‌ల్ మీడియాలో త‌మిళ రాజ‌కీయాల గురించి రోజుకో ర‌క‌మైన పోస్ట్ చేస్తూ ఆయ‌న కూడా రాజ‌కీయాల్లోకి వ‌స్తారేమో అన్న భావ‌న క‌లిగిస్తున్న సంగ‌తి తెలిసిందే!

  • Loading...

More Telugu News