: ముగిసిన ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ!
డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సిట్ విచారణ ముగిసింది. తెలంగాణ సిట్ కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు చిన్నాను అధికారులు విచారించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో చిన్నాకు గల సంబంధాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. సిట్ అడిగిన ప్రశ్నలకు చిన్నా సమాధానమిచ్చారు. విచారణ అనంతరం, మీడియాతో మాట్లాడకుండా చిన్నా వెళ్లిపోవడం గమనార్హం. కాగా, ఇప్పటివరకు ఈ వ్యవహారంలో సినిమా రంగానికి సంబంధించి ఆరుగురిని సిట్ అధికారులు విచారించారు. ప్రముఖ నటి ఛార్మిని రేపు విచారించనున్నారు.