: హీరో కాకముందే శ్రియతో రొమాంటిక్ సీన్లో రామ్ చరణ్!.. వీడియో మీరూ చూడండి


చిరంజీవి, పవన్ కల్యాణ్ ల సరసన నటించిన అందాల భామ శ్రియతో పదేళ్ల క్రితమే ఓ రొమాంటిక్ సీన్ లో రామ్ చరణ్ నటించాడు. వివరాల్లోకి వెళ్తే, సినిమాల్లోకి రాకముందు యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్ విషయంలో రామ్ చరణ్ శిక్షణ తీసుకున్నాడు. అలా శిక్షణలో ఉన్న సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో దీన్ని తీసినట్టు తెలుస్తోంది.

అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న శ్రియ... సదరు యాక్టింగ్ ఇన్స్ టిట్యూట్ ను విజిట్ చేసింది. ఆ సందర్భంగా ఆమెతో కలసి చరణ్ ఓ సీన్ లో నటించాడు. ఈ సీన్ లో శ్రియ తనదైన శైలిలో అదరగొట్టగా, చరణ్ కూడా పాత్రలో లీనమై నటించాడు. 

  • Loading...

More Telugu News