: రామ్ నాథ్ కోవింద్ తొలి ట్వీట్... నిమిషాల్లోనే 7,000కు పైగా లైక్స్
భారత నూతన రాష్ట్రపతిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రామ్ నాథ్ కోవింద్ ట్విట్టర్ లో తొలిసారిగా ట్వీట్ చేశారు. ‘‘14వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయడం గౌరవంగా ఉంది. నా బాధ్యతలను వినయ, విధేయతలతో నిర్వహిస్తాను’’ అంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్లు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు, జాతి ప్రయోజనాలే ప్రధమ ప్రాధాన్యం కావాలని ఆశించారు. రాష్ట్రపతి ట్వీట్ ను నిమిషాల్లోనే 2,500 మందికి పైగా రీట్వీట్ చేయగా, 7,000కు పైగా లైక్ కొట్టేశారు.