: కృతి సనోన్ కంటే కాలేజీ అమ్మాయిలే బాగుంటారు!: ఎద్దేవా చేసిన బాలీవుడ్ నటి


మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే' సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన నటి కృతి సనోన్ ను బాలీవుడ్ నటి ఎద్దేవా చేసింది. ఆమె శరీరాకృతిపై తీవ్ర పదజాలం ఉపయోగించి విమర్శించింది. కృతి సనోన్ ఈ మధ్య వేకువ జామున తన బెడ్ పై ఆనందంతో డాన్స్ వేసిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీనిపై బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ విమర్శిస్తూ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'రాబ్తా' సినిమా ఫ్లాప్ కావడంతో 'కృతి సనోన్ కి పిచ్చెక్కిందని, అందుకే ఇలా డాన్స్ చేస్తోందం'టూ ఆమె పోస్టు చేసిన వీడియోను రీ ట్వీట్ చేశాడు.

దీనిపై మరో బాలీవుడ్ వర్థమాన నటి భైరవి.. 'కృతి సనోన్ ఎలా హీరోయిన్ అయిందో అర్థం కావడం లేదు. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ కూడా లేదు, చాలా మంది కాలేజీ యువతులు కృతి సనోన్ కంటే అందంగా ఉంటారు' అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ఇవి బాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. ఒక నటిని మరో నటి ఈ స్థాయిలో విమర్శలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News