: రేవ్ పార్టీల్లో డ్రగ్ టాబ్లెట్లకు డిమాండ్ ఎక్కువ... అమ్మాయిలకు బ్లూ, అబ్బాయిలకు పింక్ టాబ్లెట్లు!
డ్రగ్స్ కేసు విచారణలో వెల్లడవుతున్న విషయాలు విని సిట్ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. రిసార్ట్స్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని అధికారులు గుర్తించారు. రేవ్ పార్టీల కోసం ముంబై, గోవా, ఢిల్లీ, నైజీరియా వంటి ఆఫ్రికా దేశాల యువతులను మాఫియా గ్యాంగ్ లు రప్పిస్తూ వ్యభిచారాన్ని కూడా నిర్వహించడం విశేషం. ఈ రేవ్ పార్టీలలో ఎంపిటోమైన్ తో తయారుచేసిన ట్యాబ్లెట్స్ ను డ్రగ్ మాఫియా అందిస్తోంది. ఈ ట్యాబ్లెట్స్ ను స్త్రీలకు వేరుగా, పురుషులకు వేరుగా తయారు చేయడం విశేషం.
అమ్మాయిలకు బ్లూ (నీలిరంగు) కలర్, అబ్బాయిలకు పింక్ (గులాబీ రంగు) కలర్ ట్యాబ్లెట్స్ ను ఇస్తారు. విదేశీ యువతులతో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు ఈ ట్యాబ్ లెట్స్ ను వినియోగిస్తున్నట్టు విచారణాధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ కు సపరేట్ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. పాత కస్టమర్లు రిఫరెన్స్ ఇస్తేనే కొత్తవారికి డ్రగ్స్ సరఫరా అవుతాయి. డ్రగ్స్ ను నేరుగా మాఫియాలోని వ్యక్తులే సరఫరా చేస్తారు. దీంతో కొత్తవారికి తెలిసే అవకాశం లేకుండా జాగ్రత్తపడతారని వారు గుర్తించారు.