: దేవదాస్ లాంటి సినిమా తీయడం ఇప్పుడు అసాధ్యమే.. తాగుబోతు క్యారెక్టర్లకు సినిమాల్లో చెక్.. సెన్సార్ బోర్డు సరికొత్త నిబంధన!
బాలీవుడ్ దర్శకులు బిమల్ రాయ్ కానీ, సంజయ్ లీలా బన్సాలీ కానీ ‘దేవదాస్’ వంటి సినిమాను రీమేక్ చేయాలనుకోవడం ఇక సాహసమే అవుతుంది. ‘దేవదాస్’ హీరోలు దిలీప్ కుమార్, షారూక్ ఖాన్, ‘షరాబీ’ సినిమాలో అమితాబ్ బచ్చన్.. ఇవన్నీ ఇక గడచిన చరిత్ర. ‘మున్నా మైఖేల్’ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ పోషించిన గ్యాంగ్‌స్టర్ వంటి పాత్రలకూ కష్టకాలమే. గ్యాంగ్‌స్టర్ అంటే పక్కన మందు బాటిల్ ఉండాలి కదా!
ఇక నుంచి ఇటువంటి పాత్రలు సినిమాల్లో కనిపించకపోవచ్చు. ఒకవేళ అటువంటి సినిమాలు తీయాలనుకుంటే ‘A’ సర్టిఫికెట్‌కు సిద్ధపడాల్సిందే. ఈ మేరకు సెన్సార్ బోర్డు సరికొత్త నిబంధన విధించేందుకు సిద్ధమైంది. సినిమాల్లో మద్యం తాగే పాత్రలపై కఠిన ఆంక్షలు విధించాలని సెన్సార్ బోర్డు నిర్ణయించింది. అయితే అటువంటి పాత్రలు తప్పనిసరి అయితే మాత్రం అడల్ట్ సర్టిఫికెట్ (A) జారీ చేయనున్నట్టు సెన్సార్ బోర్డ్ చీఫ్ పేర్కొన్నారు.