: జియో 4జీ ఫీచర్ ఫోన్‌‌లో ‘వాట్సాప్’ ఉండదట.. కొత్త విషయం వెలుగులోకి!


రిలయన్స్ జియో నుంచి అతి త్వరలో రానున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌కు సంబంధించి సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 20 కోట్ల మందికి పైగా భారతీయులు ఉపయోగించే పాప్యులర్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’కు ఈ ఫీచర్ ఫోన్ సపోర్ట్ చేయదని తెలుస్తోంది.

ఇందులో జియో యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తుండగా ఫేస్‌బుక్, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఎంజాయ్ చేయవచ్చని ముకేశ్ అంబానీ తెలిపారు. అయితే వాట్సాప్‌కు ఇది సపోర్ట్ చేయకపోవడం వినియోగదారులకు నిరాశ కలిగించే వార్తే. ఫోన్ విడుదల చేసిన అనంతరం తర్వాతి స్టేజ్‌లో వాట్సాప్‌ను అప్‌డేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వాట్సాప్‌కు పోటీగా ‘జియో చాట్’ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం.

  • Loading...

More Telugu News