: వివాదాస్పద సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీకి పదవీ గండం.. చంద్రప్రకాశ్‌కు చాన్స్!


వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీ త్వరలో ఆ పదవిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 28న తిరువనంతపురంలో నిహలానీ ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. దర్శక నిర్మాత ప్రకాశ్ ఝా, టీవీ నిర్మాత-నటుడు చంద్రప్రకాశ్ ద్వివేదీలలో ఒకరిని సెన్సార్ బోర్డు చైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ‘ఇందు సర్కార్’ పేరుతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై సినిమా తీసిన దర్శక నిర్మాత మధుర్ బండార్కర్ పేరు కూడా చక్కర్లు కొడుతోంది.

  • Loading...

More Telugu News