: సినీనటుడు నవదీప్ తో ముగిసిన సిట్ విచారణ.. అవసరమైతే ఫోన్ చేస్తామన్న అధికారులు!
డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ నటుడు నవదీప్ ను సిట్ అధికారులు విచారణ చేయడం పూర్తయింది. అధికారులు అడిగి పలు ప్రశ్నలకు నవదీప్ సమాధానమిచ్చాడు. సుమారు 11 గంటలపాటు అధికారులు ఆయన్ని విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన నవదీప్, మీడియాతో మాట్లాడుతూ, ‘ఈవెంట్ మేనేజర్ లింకులు, ఇందుకు సంబంధించిన సమాచారం వంటివి అధికారులు అడిగారు. నా దగ్గర ఉన్న సమాచారం అంతా క్లియర్ గా చెప్పాను. అంతా బాగానే ఉంది. మళ్లీ నన్ను రమ్మనమని అధికారులు చెప్పలేదు. అవసరమైతే, ఫోన్ చేస్తామని చెప్పారు. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో ఐదో రోజు సిట్ విచారణ పూర్తయింది. ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు రేపు విచారించనున్నారు.