: ముంబయి విమానాశ్రయంలో రణ్ బీర్ కపూర్ కు 'కష్టమ్స్'
'బర్ఫీ' సినిమాతో అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న బాలీవుడ్ యువ హీరో రణ్ బీర్ కపూర్ ను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం లండన్ నుంచి బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో ముంబయి చేరుకున్న రణ్ బీర్ నిబంధనలకు విరుద్ధంగా తనతోపాటు పలు బ్రాండెడ్ వస్తువులను వెంట తెచ్చారు. ఈ విషయమై రణ్ బీర్ ను నిర్బంధించిన కస్టమ్స్ అధికారులు అతనికి రూ. 60 వేల జరిమానా వడ్డించారు.