: కేటీఆర్ కు నారా లోకేష్, మంచు విష్ణు శుభాకాంక్షలు!


తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'కేటీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా ఉండాలి' అంటూ ఆకాంక్షించారు. ప్రపంచ కప్ లో సత్తా చాటిన మహిళా క్రికెటర్లకు కూడా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మన అమ్మాయిలు చాలా బాగా ఆడారని కితాబిచ్చారు. మీ ఆట తీరును చూసి గర్విస్తున్నామని చెప్పారు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగిందని... ఆటగత్తెలందరూ గెలుపు కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.

మరోవైపు, కేటీఆర్ కు సినీ హీరో మంచు విష్ణు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 'ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ ను తొలగించిన... నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News