: సాయంత్రం ఢిల్లీ వెళుతున్న కేసీఆర్.. కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సీఎం!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళుతున్నారు. రేపు జరగనున్న నూతన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారానికి ఆయన హాజరవనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై వీరితో ఆయన చర్చించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు ఆయన ఢిల్లీలోనే వుంటారు. మరోవైపు ప్రణబ్ ముఖర్జీని కూడా కలసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. 

  • Loading...

More Telugu News