: గ్లాసు నీరు రూపాయి... రైల్వే స్టేషన్లలో ఐఆర్సీటీసీ కొత్త వ్యాపారం
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకు విక్రయించాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. మొత్తం 1,100 వాటర్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేయనున్నామని, వీటి ద్వారా ప్రజలకు మంచినీరు విక్రయించనున్నామని రైల్వే శాఖ ప్రకటించింది. ఒక గ్లాస్ మంచినీరు (300 ఎంఎల్)ను రూపాయికి, 500 ఎంఎల్ రూ. 3కు, లీటరు నీరు రూ. 5కు, రెండు లీటర్లను రూ. 8కి విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త వెండింగ్ మెషీన్ల కొనుగోలు తరువాత సుమారు 2 వేల మందికి పైగా ఉపాధి లభిస్తుందని రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి.