: ఇస్రో మాజీ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ యూఆర్ రావు కన్నుమూత


ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చీఫ్ ప్రొఫెసర్ యూఆర్ రావు (85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హృద్యోగ సమస్యల కారణంగా ఈ ఏడాది మొదట్లో ఆయన ఆసుపత్రిలో చేరారు. రావు గతంలో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటొరీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా, తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాన్స్‌లర్‌గానూ సేవలందించారు.

అంతేకాదు, పలు ఉన్నత పదవులు నిర్వహించారు. విదేశీ యూనివర్శిటీల్లోనూ ఆయన పనిచేశారు. పది అంతర్జాతీయ అవార్డులు, మరెన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. ఉడిపిలోని అదంపూర్‌లో ఆయన జన్మించారు. ఇస్రో చైర్మన్‌గా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. ఆర్యభట్ట నుంచి మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టు వరకు ఆయన పనిచేశారు. ఈ జనవరిలో రావుకు ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. అయితే ఆ గౌరవాన్ని తాను మరణానంతరం అందుకుంటానని ఆయన చెప్పడం విశేషం.

  • Loading...

More Telugu News