: సినిమావాళ్లేనా?....ఇతర బడాబాబులెవరూ లేరా?: రేవంత్ రెడ్డి సవాల్


హైదరాబాదులో డ్రగ్స్ దందాలో కేవలం సినిమా వాళ్లు మాత్రమే తప్పు చేశారా? ఇతర రంగాలకు చెందిన ప్రముఖులెవరూ ఇందులో లేరా? వారందరికీ నోటీసులు ఎందుకు పంపలేదు? అని టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్ దందాపై ఆయన మాట్లాడుతూ, తిమింగలాలను వదిలేసి, చిన్న చేపలను పట్టుకోవడం ప్రభుత్వానికి అలవాటేనని అన్నారు. ప్రభుత్వ విచారణ విధానంతో డ్రగ్స్ దందాలో కేవలం సినిమా వాళ్లు మాత్రమే ఉన్నారని, పబ్ లకు సినిమావాళ్లు తప్ప ఇతరులెవరూ వెళ్లడం లేదని చెబుతున్నట్టు ఉందని అన్నారు.

హైదరాబాదులోని పబ్ లలో కేవలం సినిమా వారికే డ్రగ్స్ ఇస్తారా? ఇతరులకు ఇవ్వరా? అని ఆయన నిలదీశారు. మరి అందరినీ ఒకేలా విచారిస్తే...ఇతర ప్రముఖులకు ఇంకా నోటీసులు ఎందుకు వెళ్లలేదని ఆయన అడిగారు. పబ్ ల సీసీ టీవీ పుటేజీల్లో సినిమా వాళ్లు తప్ప ఇంకెవరూ లేరా? అని ఆయన అడిగారు. 'నేను నేరుగా ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నా...ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ సినీ ప్రముఖులను విచారించినట్టే విచారించగలరా? వారికి శిక్షలు పడేలా చేయగలరా?' అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News