: మీరు అతిగా ఖర్చు చేస్తున్నారా? లేక పొదుపుగా ఉంటున్నారా?... తెలుసుకోండి


ప్రతి ఒక్కరూ డబ్బును ఆదాచేయాలని, పొదుపుగా ఉండాలని భావిస్తుంటారు. అయితే జీతం వచ్చేసరికి మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. దీంతో ఎక్కడ అనవసరంగా ఖర్చు చేశామో అర్థం కాక చాలా మంది తికమకపడుతుంటారు. అసలు తప్పెక్కడ జరిగింది? అన్నది ఆలోచించి మళ్లీ పొదుపు గురించి ఆలోచిస్తుంటారు. మళ్లీ మామూలే... తప్పు ఎక్కడ జరిగిందన్నది ఎవరికీ అర్థం కాదు.

సౌకర్యాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పొదుపు చాలా ముఖ్యమైన విషయం. అయితే మీరు దుబారా ఖర్చు చేస్తుంటారా? లేదా? అన్న విషయం తెలుసుకునేందుకు ఒక సూచీ ఉంది. మీరు కూడా ఓసారి ఈ ప్రశ్నలు వేసుకుని సెల్ఫ్ చెక్ చేసుకోండి.

1) మీరు షాపింగ్ కి వెళ్లినప్పుడు నచ్చిన వస్తువులు కనిపిస్తే అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేస్తారు.
ఎ) కాదు  బి) అవును

2. మీ నెల సంపాదన కంటే ఎక్కువ ఇంతవరకు మీరెప్పుడూ ఎక్కువ ఖర్చు చేయలేదు.
ఎ) అవును   బి) కాదు

3) మీరు ఉద్యోగం చేయడంతో పాటు అదనపు ఆదాయం కోసం పార్ట్‌ టైమ్‌ జాబ్/వర్క్‌ చేస్తుంటారు.
ఎ) అవును  బి) కాదు

4) మీరు జీతంలో ఎంతో కొత్త మొత్తాన్ని బ్యాంక్‌ లో సేవింగ్స్‌ చేయటం లేదు.
ఎ) కాదు   బి) అవును

5) మీ దగ్గర డబ్బులున్నా, లేకున్నా మీరు సౌకర్యవంతంగా( క్యాబ్ లో) ప్రయాణించే ప్రయత్నం చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మీకు నచ్చదు.
ఎ) కాదు  బి) అవును

6) మీరు షాపింగ్ కు వెళ్లిన ప్రతిసారి కొత్త డ్రస్‌ లు కొంటూనే ఉంటారు.
ఎ) కాదు   బి) అవును

7) మీ ఖర్చులు దాటుతున్నాయని గుర్తించినప్పుడు మీరు విలాసాలు తగ్గించుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు
ఎ) అవును   బి) కాదు

8) సరదాలు తీర్చుకునేందుకు అప్పు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు.
ఎ) కాదు   బి) అవును

ఈ 8 ప్రశ్నల్లో మీ సమాధానాలు 6 'ఏ'లు దాటితే మీరు జాగ్రత్త పరులేనని, దుబారాకు పోకుండా జాగ్రత్తగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నారని అర్ధం. అలా కాకుండా ‘బి’ లు ఆరు దాటితే మీరు మీ ఖర్చులను ఒకసారి సరిచూసుకోవాల్సిందే. ఒకటికి రెండు సార్లు ఖర్చు చేయాల్సిందే. లేని పక్షంలో డాబు దర్పాలకుపోయి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంటారని గుర్తించాలి. ఇది భవిష్యత్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News