: కోచ్ వివాదంలో కోహ్లీని వెనకేసుకొచ్చిన ఆస్ట్రేలియా లెజెండ్ ఇయాన్ చాపెల్!


టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే వ్యవహారంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని అందరూ తప్పుపడుతున్న వేళ ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ అండగా నిలిచాడు. కోచ్‌తో కెప్టెన్‌కు ఇబ్బందులు ఉన్నప్పుడు తనకు అనుకూలమైన వ్యక్తిని కోచ్‌గా ఎంచుకోవడంలో తప్పులేదని ఇయాన్ పేర్కొన్నాడు. ‘‘కుంబ్లేతో కోహ్లీకి అంతమంచి సంబంధాలు లేవు. రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బాగా సఖ్యత కుదిరింది. ఆ కారణంగానే రవిని కోచ్‌గా కావాలనుకున్నాడు’’ అని ఇయాన్ పేర్కొన్నాడు. కాగా, గత నెలలో చాంపియన్స్ ట్రోపీ ముగిసిన వెంటనే కుంబ్లే తన కోచ్ పదవి నుంచి తప్పుకోవడం పెద్ద దుమారాన్నే లేపింది. అయితే ఈ విషయంలో కోహ్లీ ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News