: భారత్కు మిగ్-35ను విక్రయించేందుకు రష్యా ఆసక్తి... ఎయిర్ టు ఎయిర్ యుద్ధంలో అమెరికా జెట్లు సైతం దీని ముందు దిగదుడుపే!
అత్యంత శక్తిమంతమైన మిగ్-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు రష్యా ఆసక్తిచూపుతోంది. రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ టారసెంకో మాట్లాడుతూ మిగ్ విమానాలు చాలా ఉత్తమమైనవని అన్నారు. యుద్ధవిమానం ఎఫ్-35 కంటే ఇది చాలా శక్తిమంతమైనదని పేర్కొన్నారు. నింగిలో జరిగే యుద్ధంలో అమెరికా జెట్లను సైతం ఇది ఢీకొనగలదని పేర్కొన్నారు. వీటిని భారత్ వాయుసేనకు విక్రయించేందుకు భారత్తో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కాగా, భారత్ గత 50 ఏళ్లుగా మిగ్ విమానాలను ఉపయోగిస్తోంది. మిగ్-35 విమానాల ఫ్లైట్ టెస్ట్లు ఈ ఏడాది జనవరి 26 నుంచే ప్రారంభమయ్యాయి.