: ‘బిగ్ బాస్’ నుంచి తనను ఎలిమినేట్ చేయాలంటున్న సంపూర్ణేష్ బాబు!


‘బిగ్ బాస్’ షో నుంచి తనను ఎలిమినేట్ చేయాలంటూ నటుడు సంపూర్ణేష్ బాబు విజ్ఞప్తి చేశాడు. ఈ షోలో తొలి నాలుగు రోజులు కెప్టెన్ గా సంపూ వ్యవహరించాడు. అయితే, తగిన రీతిలో ఆకట్టుకోకపోవడం, సభ్యులను నియంత్రించడంలో విఫలమవడమే కాకుండా, సంపూ అధిక సమయం నిద్రకే కేటాయించారనే కారణాలతో కెప్టెన్సీ నుంచి అతనిని తప్పించారు. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే సంపూ కొంచెం ఒత్తిడికి గురవడమే కాకుండా కంటతడి పెట్టుకున్నాడు.

ఓసారి ఛాతీలో కాస్త నొప్పిగా ఉందని తోటి సభ్యులకు చెప్పాడు. మెడిసిన్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సంపూ ఆందోళన చెందాడు. తనను ఈ షో నుంచి తప్పించాలని కోరుతూ..‘ ‘బిగ్ బాస్’ గారు నన్ను ఇంటికి పంపించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని సంపూ విన్నవించుకోవడం గమనార్హం. అయితే, ‘బిగ్ బాస్’ షోలో మరో సభ్యుడు ధన్‌రాజ్ చొరవ తీసుకుని సంపూర్ణేష్‌కు ధైర్యం చెప్పాడని,. టెన్షన్ పడవద్దని, అంతా మంచి జరుగుతుందని నచ్చజెప్పినట్టు సమాచారం. ఒకవేశ నిజంగానే ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం వచ్చే వారం అందరితో చెప్పి ఎలిమినేషన్‌లో సంపూ పేరు వచ్చేలా చేస్తామని, తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని  'బిగ్ బాస్' హామీ ఇవ్వడంతో సంపూ కొంచెం నెమ్మదించాడు.

  • Loading...

More Telugu News