: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు
లార్డ్స్ వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 11.1 ఓవర్ల వద్ద టీమిండియా బౌలర్ ఆర్ఎస్ గైక్వాడ్ బౌలింగ్ లో విన్ ఫీల్డ్ (24) వద్ద అవుటైంది. 14.3 ఓవర్ లో
పూనమ్ యాదవ్ బౌలింగ్ లో బ్యూమోంటో (23) అవుటైంది. కాగా, క్రీజ్ లో హెచ్ సీ నైట్, ఎస్ టేలర్ ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు స్కోరు.. 15.5 ఓవర్లలో 69/2. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది.