: 'జై లవ కుశ' వర్కింగ్ స్టిల్... 'సమ సమాజ్' పార్టీ పెట్టి, గుర్తుగా పాల క్యాన్ ను ఎంచుకున్న ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ బయటకు రాగా, 'సమ సమాజ్ పార్టీ' పేరిట ఎన్టీఆర్ ఫోటోతో కూడిన జెండాలు, బ్యానర్లు కట్టిన జీపులు, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రచారం దృశ్యాలు ఉన్నాయి. పార్టీ గుర్తు పాల క్యాన్. ఇక బ్యానర్లపై అక్షరాలు ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉండటంతో ఇది ఉత్తర భారతదేశంలోని ఓ ప్రాంతానికి చెందిన పాత్రగా కథలో భాగమై ఉండవచ్చని సమాచారం. ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News