: పద్మావతీ దేవికి లక్ష్మీహారాన్ని కానుకగా ఇచ్చిన లగడపాటి రాజగోపాల్
ఈ ఉదయం తిరుపతికి వచ్చిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని విలువైన కానుకలను సమర్పించారు. అమ్మవారికి ఆయన రూ. 8 లక్షల విలువైన లక్ష్మీహారాన్ని అందించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆయన, ఆపై కొండ దిగి తిరుచానూరు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికిన అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి మొక్కును తాను తీర్చుకున్నానని ఈ సందర్భంగా లగడపాటి వ్యాఖ్యానించారు.