: పబ్బుల్లో డ్రగ్స్ కల్చర్ తెచ్చిందే నువ్వు... ఆధారాలున్నాయి: సిట్ అధికారుల వ్యాఖ్యతో నీళ్లు నమిలిన తరుణ్


హైదరాబాద్ లోని పబ్బుల్లో డ్రగ్స్ వాడకాన్ని పరిచయం చేసిన వ్యక్తి నువ్వే అనడానికి తమ వద్ద సాక్ష్యాలున్నాయని సిట్ అధికారులు వెల్లడించిన వేళ, నటుడు తరుణ్ నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది. నిన్న సిట్ విచారణను సుమారు 13.30 గంటల పాటు ఎదుర్కొన్న ఆయన, పలు ప్రశ్నలకు ముక్తసరిగా, పొడిపొడిగా మాత్రమే సమాధానాలు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. తనకు గతంలో ఓ పబ్ లో వాటా ఉందని, ఆ వ్యాపారం చెడ్డ పేరు తెస్తుందన్న ఆలోచనతో దాన్ని వదిలేసుకున్నానని తరుణ్ చెప్పగా, 'ఆన్' అనే పబ్ తరుణ్ పేరిటే ఉందన్న సాక్ష్యాలను అధికారులు అతని ముందుంచారు.

దీంతో అవాక్కయిన తరుణ్, ఏం చెప్పాలో తెలియక, ఆపై సర్దుకొని, ఆ పబ్ ను కూడా విక్రయించానని, అయితే యాజమాన్య హక్కులు ఇంకా మారలేదని పేర్కొన్నట్టు తెలిసింది. తరుణ్ నడిపిన పబ్ లలోని వీడియోలు, తరుణ్ తో కెల్విన్ తదితరులు దిగిన చిత్రాలను సాక్ష్యాలుగా చూపుతూ అధికారులు ప్రశ్నిస్తుంటే, తాను డ్రగ్స్ వాడలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News