: డోక్లాంలో ఏం జరుగుతుందో తమకెందుకంటున్న చైనా యువత


భారత్, చైనా, భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతమైన డోక్లాంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, చైనా అధికారిక మీడియా ‘ఇండియాకు గుణపాఠం చెప్పాలి’ అంటూ నిత్యమూ పుంఖాను పుంఖాలుగా కథనాలను రాస్తున్న వేళ,  చైనా యువత మాత్రం దీని గురించి అసలు పట్టించుకోవడం లేదు. అసలు చైనా, ఇండియాల మధ్య సరిహద్దు సమస్య వచ్చినట్టు కూడా చైనా యువతలో అత్యధికులకు తెలియదు. చైనాలో ట్విట్టర్ వర్షన్ వీబోను 34 కోట్ల మంది వాడుతుండగా, ఇటీవల ట్రెండింగ్ అవుతున్న టాప్ 50 టాపిక్స్ లో డోక్లాం లేదా సరిహద్దు ఉద్రిక్తతలు లేకపోవడం గమనార్హం. ఇక సాధారణ పౌరులకు ఇండియా పట్ల ఎంతమాత్రమూ వ్యతిరేకత లేదని, అందువల్ల సోషల్ మీడియాలో చర్చలు సాగడం లేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News